బుధవారం, 18 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 ఆగస్టు 2024 (14:47 IST)

ఇంటికి వచ్చిన అల్లుడికి వంద పిండి వంటకాలతో విందు (Video)

foods
ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి అత్తింటివారు ఏకంగా 100కు పైగా పండి వంటకాలతో విందు భోజనం వడ్డించారు. అత్తమామల మర్యాదలకు ఆ అల్లుడి నోట మాటరాలేదు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు గత యేడాది సెప్టెంబరు నెలలో వివాహం జరిగింది. వివాహమై ఆషాఝ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు 100 రకాల పిండివంటలతో భోజన ఏర్పాట్లు చేశారు. అత్తగారు 100 రకాల పిండి వంటలు చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
పాఠశాలపై ఔదార్యాన్ని చాటుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్!
 
ప్రముఖ దర్శకుడు, 'కల్కి' ఫేం నాగ్ అశ్విన్ ప్రభుత్వ పాఠశాలపై తన ఔదార్యాన్నిచాటారు. తన స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లాలోని ఐతోల్ గ్రామం. ఇక్కడ తన తాత పేరు మీద సింగిరెడ్డి పర్వత్ రెడ్డి పేరుతో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దర్శకుడు నాగ్ అశ్విన్ అదనపు గదులు నిర్మించి ఇచ్చారు. తన తండ్రి చదువుకున్న ఈ ప్రభుత్వ పాఠశాలకు తన వంతు సాయంగా ఈ అదనపు గదులను నిర్మించి ఇచ్చినట్లు నేడు ప్రారంభోత్సవంలో నాగ్ అశ్విన్ తెలపడం జరిగింది.
 
భవిష్యత్తులో మరింత సహాయం చేయడానికి తమ కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు హీరోలు దర్శకులు కాకపోయినా డాక్టర్లు ఇంజనీర్లుగా ఎదిగి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. నాగర్ కర్నూల్ ప్రాంతానికే ప్రపంచంలో గుర్తింపు తెచ్చే విధంగా ఈ ప్రాంతం నుంచి దర్శకుడిగా ఎదగడం చాలా సంతోషమని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు.