శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 జులై 2024 (13:13 IST)

గోదావరి జలాలను శుద్ధి చేస్తాం.. సురక్షిత మంచినీరు అందిస్తాం - కందుల

Godavari
గోదావరి జలాల్లో కాలుష్యాన్ని నివారించి ప్రజలకు సురక్షిత మంచినీటిని ప్రభుత్వం సరఫరా చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలో గోదావరి పరిరక్షణ సమితి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 
 
గోదావరి జలాలు కలుషితమయ్యాయని, దానిని శుభ్రం చేయాలని అన్నారు. వృధా జలాలు నదిలో కలుస్తున్నాయన్నారు. వృధా నీటి కోసం ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేస్తే నదిలో కాలుష్యాన్ని భారీగా తగ్గించవచ్చని తెలిపారు. దుర్గేష్ మాట్లాడుతూ వ్యర్థ జలాలు నదిలో కలపకుండా వేస్ట్ వాటర్ ఛానల్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.