శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 జూన్ 2024 (16:26 IST)

విశ్వంభర సెట్ లో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు చిరు సన్మానం

Chiranjeevi, Kandula Durgesh,  keeravani
Chiranjeevi, Kandula Durgesh, keeravani
మెగా స్టార్ చిరంజీవి మిత్రుడు కందుల దుర్గేష్ విశ్వంభర సెట్ కు విచ్చేసారు. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా 'విశ్వంభర' సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని కోరుతున్నాను అంటూ శుభాకాంక్షలు తెలిపారు.                     
 
Chiranjeevi, Kandula Durgesh   and viswambhara team
Chiranjeevi, Kandula Durgesh and viswambhara team
తెలుగు చలనచిత్ర  పరిశ్రమ అభివృద్ధికి , ఎదుర్కొంటున్న  సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని కందుల దుర్గేష్ చెప్పారు. ఆయన సానుకూలతకు  హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. 
 
Chiranjeevi, Kandula Durgesh
Chiranjeevi, Kandula Durgesh
అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను అన్నారు. ఈ సందర్భంగా విశ్వంభర చిత్రం గురించి పలు విషయాలు తెలియజేసారు.