మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 మే 2024 (18:36 IST)

ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చిరంజీవి పిలుపు - అయినా కొన్ని చోట్ల సగం మాత్రమే పోలింగ్

chiru at jublihills poling booth
chiru at jublihills poling booth
ప్రస్తుతం ఆంధ్రపదేశ్ లోనూ, తెలంగాణాలో నూ జరుగుతున్న అసెంబ్లీ, ఎం.పి. ఎలక్షన్ల లో ప్రతి ఒక్కరు ఓటు వేసి బాధ్యతాయుతంగా పౌర కర్తవ్యాన్ని పూర్తి చేయాలని చిరంజీవి కోరారు. సోమవారంనాడు మెగా స్టార్ చిరంజీవి, భార్య సురేఖ, కూతురు సుస్మితతో కలిసి జూబ్లీ క్లబ్ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
balakrishna, vasundhara
balakrishna, vasundhara
అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురంలో ఓటు వేసి ప్రజాస్వామ్యం పట్ల తమకున్న నిబద్ధతను చాటుకున్నారు.
ఇంకోవైపు  *జూబ్లీ క్లబ్ లో ఓటు హక్కు వినియోగించుకోవాడానికి వచ్చిన రామ్ చరణ్ , ఉపాసన దంపతులు ఓటు వేశాక అందరూ ఓటు వేయాలని కోరారు.
 
Mahesh, namrata
Mahesh, namrata
ఇక జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో హీరో మహేష్ బాబు,  భార్య నమ్రత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా ప్రతి ప్రముఖులు ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, హైదరాబాద్ లోని పలుచోట్ల సగానికి మాత్రమే ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. 
 
మణికొండ ఏరియాలోని పలుబూత్ లలో నలభై ఐదు శాతం ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. సిటీలోని యూత్ అంతా పలు ప్రాంతాలకు తమ ఊళ్ళకు వెళ్ళారని అందుకే యూత్ ఓటింగ్ పలచగా వుందని అధికారు తెలియజేశారు.