అదరహో మంగళగిరి రైల్వే స్టేషన్... ఏమున్నదక్కడ?(ఫోటోలు)
మునుపెన్నడూ చూడని ఓ సుందరమైన రైల్వే స్టేషన్ చూడాలంటే ఇక మంగళగిరి రావలసిందే. రాజధాని అమరావతి ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్ ఇప్పుడు పర్యాటక కేంద్రం అయ్యింది. రాష్ట్రాన్ని పర్యాటక ఆకర్షణా తీర్చిదిద్దటంలో ఏ ఒక్క అవకాశాన
మునుపెన్నడూ చూడని ఓ సుందరమైన రైల్వే స్టేషన్ చూడాలంటే ఇక మంగళగిరి రావలసిందే. రాజధాని అమరావతి ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్ ఇప్పుడు పర్యాటక కేంద్రం అయ్యింది. రాష్ట్రాన్ని పర్యాటక ఆకర్షణా తీర్చిదిద్దటంలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోని రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంగళగిరి రైల్వేస్టేషన్‌ను సైతం అదే కోణంలో చూసింది. ఫలితంగా స్టేషన్ రూపురేఖలు మారిపోయాయి. కనువిందు కలిగించే పెయింటింగ్స్ ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణీకులు ఎక్కడ కూర్చున్నా, ఓ సుందరమైన కలంకారీ చిత్రం కనువిందు చేస్తుంది.
మనస్సును ఆహ్లాదపరుస్తూ సాంప్రదాయతకు పెద్దపీట వేస్తూ ప్రతి గోడను ఒక పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దుతూ చేపట్టిన ఈ కార్యక్రమం వెనుక ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కృషి ఎంతో ఉంది. కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని రైల్వేస్టేషన్‌ను సుందరంగా తీర్చిదిద్దాలని భావించటం ఒక ఎత్తయితే తదనుగుణ అనుమతులు పొందటం మరో పెద్ద కసరత్తే. పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి సూచనల మేరకు స్వయంగా రంగంలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హిమాన్షు శుక్లా రంగంలోకి దిగారు.
ప్రత్యేకించి అమరావతి ప్రాంతం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను రైల్వే శాఖకు వివరించి అవసరమైన అనుమతులు పొందారు. స్వయంగా పలుమార్లు రైల్వే స్టేషన్‌ను సందర్శించిన అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం స్టేషన్‌లో కళాకృతులు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఫలితంగా మంగళగిరి రైల్వేస్టేషన్ నుండి రాకపోకలు సాగించే ప్రయాణీకులు ఇప్పడు ప్రత్యేక అనుభూతికి లోనవుతున్నారు. కేవలం మంగళగిరి నుండి బయలు దేరి, అక్కడ దిగే ప్రయాణీకులే కాక, ఆ మార్గం వెంబడి సాగే రైళ్ల నుండి ఈ స్టేషన్‌లో బయటకు చూసినప్పడు ప్రయాణీలు ఆహా అనకమానరు. ఈ నేపధ్యంలో బుధవారం ఈ పర్యాటక ఆకర్షితభరితమైన మంగళగిరి రైల్వే స్టేషన్‌ను అధికారికంగా ప్రజలకు అంకితం చేయనున్నారు.
కార్యక్రమంలో పర్యాటక అభివృద్ది సంస్ధ ఛైర్మన్ అచార్య జయరామి రెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఉన్నత స్థాయి డివిజినల్ రైల్వే అధికారులు పాల్గొంటారని ఎపిటిడిసి ఎండి హిమాన్హు శుక్లా తెలిపారు. ఉదయం పదకొండు గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది.