కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ప్రజలు అందర్నీ కలేసికొడతారు : కేఈ కృష్ణమూర్తి
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అవతరించిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టి తిరిగి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఇంకేమైనా ఉందా అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అవతరించిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టి తిరిగి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఇంకేమైనా ఉందా అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఒక వేళ పొత్తంటూ పెట్టుకుంటే ప్రజలు తిరగబడి అందర్నీ కలేసికొడతారంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదని తేల్చిచెప్పారు. టీడీపీ జాతీయ పార్టీ అని, ఇతర రాష్ట్రాల్లో పొత్తులు ఏవిధంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో మాత్రం పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని తాను చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య స్పందించడపై కేసీఆర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్ల ఎవరు తనకు చెప్పడానికి అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారన్నది తమ మనసులలో నాటుకుపోయిందని, కింది స్థాయి కేడర్ నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వెల్లడించానని అన్నారు.