బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : శనివారం, 25 ఆగస్టు 2018 (14:42 IST)

రమ్య ఎటెళ్లిపోయింది.. వరదలు ముంచేస్తుంటే జర్మనీలో ఈ ఫోటో ఏంటి?

కాంగ్రెస్ నేత, సినీ నటి రమ్య ప్రజల సమస్యలపై స్పందించేందుకు ముందుంటారు. కాంగ్రెస్ నేతగా పార్టీకి సంబంధించిన అన్నీ విషయాల్లో చురుకుగా వ్యవహరిస్తుంటారు. గత కొంతకాలంగా ఆమె పార్టీకి, సోషల్ మీడియాకు దూరంగా

కాంగ్రెస్ నేత, సినీ నటి రమ్య ప్రజల సమస్యలపై స్పందించేందుకు ముందుంటారు. కాంగ్రెస్ నేతగా పార్టీకి సంబంధించిన అన్నీ విషయాల్లో చురుకుగా వ్యవహరిస్తుంటారు. గత కొంతకాలంగా ఆమె పార్టీకి, సోషల్ మీడియాకు దూరంగా వుంటున్నారు. కేరళ, కర్ణాటకల్లో వర్షాలు, వరదలు ముంచెత్తినా రమ్య స్పందించలేదు. దీనిపై నటి రమ్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
అయితే ఉన్నట్టుండి నటి రమ్యకు సంబంధించిన ఒక ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొద్ది కాలంగా కనిపించని రమ్య ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు జర్మనీ పర్యటనలో రమ్య వున్నారు. రమ్యతో పాటు కాంగ్రెస్‌ నేత మిలింద్‌ దియోరా కలిసి తీయించుకున్న ఫొటోతో పాటు కర్ణాటక ఇన్‌చార్జిలలో ఒకటైన మధుయాష్కి గౌడతో కూడా రమ్య దిగిన ఫొటో వైరల్‌ అవుతోంది.
 
రాష్ట్రంలోని కొడగు జిల్లా భారీ వర్షాలు, వరదలతో అట్టుడికిపోయి ప్రజలు హాహాకారాలు చేస్తుంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన రమ్యకు విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చిందని నెటిజన్లు మండిపడుతున్నారు. మరి ఈ వార్తలపై రమ్య ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.