మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (21:31 IST)

కేశినేని నానీ దొంగ: దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

ప్ర‌జ‌ల ‌గురించి అలోచించే మ‌న‌స్సు టిడిపి నాయ‌కుల‌కు లేద‌ని, కేశినేని ట్రావెల్స్ ప‌నిచేసే వంద‌ల మంది కార్మికుల పొట్ట‌గొట్టిన దొంగ కేశినేని నానీ అని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. 
 
వ‌చ్చే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టిడిపికి డిపాజిట్లు కూడా ద‌క్క‌వ‌న్నారు. న‌గ‌ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సొమ‌వారం 48వ డివిజ‌న్ చిట్టిన‌గ‌ర్ న‌గ‌రాల మ‌హాల‌క్ష్మి అమ్మవార్ల దేవ‌స్థానం నుంచి  మంత్రి త‌న ప‌ర్య‌ట‌న ప్రారంభించారు.
 
కెఎన్ ఆర్ పేట‌, రాయ‌ప్ప‌రాజువీధి, సొరంగం కొండ ప్రాంతం, సాధుజాన్ వీధి, బంగ‌ర‌య్య కొట్టు, వాగుసెంట‌ర్‌, గంధ‌మాల అచమ్మ వీధి త‌దిత‌ర ప్రాంతాల‌ను ప‌ర్య‌టించారు. స్థానికుల‌ను స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. సొరంగం కొండ ప్రాంతం మెట్లు నిర్మాణం ప‌నులు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.
 
కాంగ్రెస్ నుంచి వైసీపీ లోకి
వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సీనియర్ నాయకులు గాలి కోట‌య్య ఆధ్వ‌ర్యంలో దాదాపు 100 మంది కార్య‌క‌ర్త‌లు మంత్రి వెలంపల్లి సమక్షంలో వైసీపీలో చేరారు. వారందరికీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.