మంగళవారం, 31 జనవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated: మంగళవారం, 29 నవంబరు 2022 (21:12 IST)

వైఎస్ షర్మిల కారులో వుండగానే క్రేన్‌తో తీసుకెళ్తారా? కిషన్ రెడ్డి

వైఎస్ షర్మిల కారులోనే వుండగానే కారును క్రేన్‌తో పోలీసులు తరలిస్తున్న వీడియోను బీజేపీ నేత కిషన్ రెడ్డి పోస్టు చేశారు. ఓ మహిళ అని కూడా చూడకుండా షర్మిలను కారులో ఉండగానే ఆ కారును క్రేన్ తో లాక్కెళ్లడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళ పట్ల కేసీఆర్ సర్కారు విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శించిందన్నారు. దీన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ చర్యను కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. విపక్షాల గొంతు నొక్కడం కేసీఆర్‌కు అలవాటుగా మారిపోయిందన్నారు. 
 
మరోవైపు షర్మిల భర్త, ప్రముఖ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుంటానని.. లోపలికి కచ్చితంగా వెళ్తానన్నారు.

లోపలికి వెళ్లనివ్వకపోవడానికి తానేమీ క్రిమినల్‌ను కాదని ఫైర్ అయ్యారు. పాదయాత్ర చేయడం తప్పేమీ కాదని, నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని అనిల్ స్పష్టం చేశారు.