ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసుదేవన్ ఆరంబాకం
Last Modified: శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:43 IST)

ముగ్గురి ఎమ్మెల్యేల రాజీనామాలకు ఆమోదం

నిరసన తీర్మానాలు చేసిన అధికార పక్షంలో నల్లచొక్కాలతో హాజరైన అసెంబ్లీ సమావేశాలలో... పార్టీలు మారుతూ రాజీనామాలు సమర్పించిన ముగ్గురి ఎమ్మెల్యేలు రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. వివరాలలోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. 
 
వారిలో తెదేపా నుండి వైకాపా గూటికి చేరిన మేడా మల్లిఖార్జునరెడ్డి, తెదేపా నుండి జనసేనలో చేరిన రావెల కిశోర్‌బాబు, భాజపా నుండి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణలు ఉన్నారు. ఈ ముగ్గురి రాజీనామాలకు స్పీకర్ ఆమోదముద్ర వేసారు. పార్టీ మారే సమయంలోనే ఈ ముగ్గురు తమ ఎమ్మెల్యే పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు కూడా రాజీనామా చేసారు.