27 నుంచి మళ్లీ కృష్ణా ఎక్స్‌ప్రెస్
సుమారు 10 నెలల వ్యవధి తర్వాత మళ్లీ కృష్ణా ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కి కూతపెట్టనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్ సర్వీసులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందనున్నాయని రైల్వే శాఖ ప్రకటించింది. తిరుపతి- ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ మొత్తం 59 స్టేషన్లలో ఆగుతుంది.
ఈ రైలు ప్రతీ రోజూ ఉదయం 5.50 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, మల్కాజిగిరికి రాత్రి 9 గంటలకు.. ఆదిలాబాద్ మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో.. ఆదిలాబాద్ నుంచి రాత్రి 9.05 గంటలకు బయలుదేరి.. మల్కాజిగిరికి మరుసటి రోజు ఉదయం 5.15 గంటలకు.. అదే రోజు రాత్రి 9.35 గంటలకు తిరుపతి చేరుతుంది.
సికింద్రాబాద్-మణుగూరు-సికింద్రాబాద్ (నెం.02745/02746), కాచిగూడ-యల్హంక-కాచిగూడ (నెం.07603/07604), గుంటూరు-రాయగడ-గుంటూరు (నెం.07244/07243), కాకినాడపోర్టు-తిరుపతి-కాకినాడపోర్టు (నెం.07249/07250) రైళ్లను కూడా రైల్వే శాఖ ఈ నెల 27, 28, 29 నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురానుంది.