శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 సెప్టెంబరు 2018 (12:30 IST)

శోభనం రాత్రి భార్యకు షాక్.. నేను నపుంసకుడను... నిన్ను సుఖపెట్టలేనన్న టెక్కీ భర్త...

నవ వధువుకు శోభనం రోజు రాత్రి భర్త తేరుకోలేని షాకిచ్చాడు. పాలగ్లాసుతో ఎదురు చూస్తున్న భార్యకు... తాను నపుంసకుడనీ, శారీరకంగా సుఖపెట్టలేనంటూ, ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దంటూ వరుడు ప్రాధేయపడ్డాడు.

నవ వధువుకు శోభనం రోజు రాత్రి భర్త తేరుకోలేని షాకిచ్చాడు. పాలగ్లాసుతో ఎదురు చూస్తున్న భార్యకు... తాను నపుంసకుడనీ, శారీరకంగా సుఖపెట్టలేనంటూ, ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దంటూ వరుడు ప్రాధేయపడ్డాడు. ఈ మాటలు విన్న నవవధువు దిక్కుతోచక కుమిలికుమిలి ఏడ్చింది. చివరకు చేసేదేంలేక మిన్నకుండిపోయింది. అయితే, భర్త తన నగ్నఫోటోలు తీసి పైశాచికంగా వేధించసాగాడు. ఈ వేధింపులను భరించలేని భార్య.. తన భర్తలోని లోపాన్ని బయటపెట్టింది. కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన త్రివేణి అనే యువతికి కర్నూలు జిల్లాకు చెందిన మాచాని రాజేంద్రప్రసాద్‌తో గత యేడాది ఆగస్టులో వివాహమైంది. అల్లుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడంతో రూ.55 లక్షల కట్నమిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అయితే పెళ్లయి 24 గంటలు గడవకముందే శాడిస్ట్ మొగుడు నుంచి వేధింపులు మొదలయ్యాయి. ముఖ్యంగా శోభనం రోజు రాత్రి తనలోని లోపాన్ని భార్యకు చెప్పిన రాజేంద్రప్రసాద్ తనకు అన్ని విధాలుగా సహకరించాలని కోరాడు. దీంతో కొంతకాలం పాటు ఆమె ఈ గుట్టును బయటకు చెప్పలేదు. 
 
కానీ, పిల్లలు కలగక పోవడంతో అత్త నిలదీసింది. దీంతో త్రివేణి తన భర్తలోని లోపాన్ని అత్తకు చెప్పింది. అయితే.. కొడుకు చేసిన పనికి సిగ్గుపడాల్సిన అత్త.. కోడలినే వదిలించుకోవాలనుకుంది. అందరూ కలిసి చివరకు నవ వధువుకు టీబీ రోగం అంటగట్టారు. తమ కొడుకుకు రెండో పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అయితే అప్పటికే అన్నింటికీ సిద్ధపడ్డ రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులు త్రివేణికి టీబీ ఉందని, ఆ విషయం దాచి పెళ్లి చేసి.. తన కొడుకు జీవితాన్ని నాశనం చేశారని కొత్త నాటకానికి తెరలేపారు. అయితే త్రివేణిపై పడిన నిందను చెరిపేందుకు కర్నూలు అపోలోకి ఆమెను తీసుకెళ్లి.. వైద్య పరీక్షలు చేయించి.. టీబీ లేదని రిపోర్ట్‌లు కూడా తీసుకొచ్చారు. అయినప్పటికీ త్రివేణిని వదిలించుకునేందుకు రాజేంద్రప్రసాద్ రెండో పెళ్లికి సిద్ధపడటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.