మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (17:41 IST)

ఆ వీడియోలోలా ప్రయత్నిద్దామంటే? ఏం చేయను?

నేటి యువతపై అశ్లీల మూవీల ప్రభావం ఎక్కువగా ఉంది. అనేక మంది ఈ తరహా వీడియోలు చూసి.. అమితంగా ఆకర్షితులవుతున్నారు. పైగా, తమ ప్రియురాల్లు లేదా భార్యల వద్ద అదే విధంగా చేసేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు.

నేటి యువతపై అశ్లీల మూవీల ప్రభావం ఎక్కువగా ఉంది. అనేక మంది ఈ తరహా వీడియోలు చూసి.. అమితంగా ఆకర్షితులవుతున్నారు. పైగా, తమ ప్రియురాల్లు లేదా భార్యల వద్ద అదే విధంగా చేసేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అయితే, అశ్లీల వీడియోల ప్రభావంతో అసహజ పద్ధతుల్లో భర్త ప్రయత్నిస్తే కొత్తగా పెళ్లయిన వధువు ఏం చేయాలన్న అంశంపై నిపుణులను సంప్రదిస్తే...
 
నిజానికి ఆ వీడియోల్లో చూపించినట్టు అసహజ భంగిమలు, పద్ధతులు అనుకరించడానికి తొలినాళ్లలో ప్రయత్నాలు జరగకపోవచ్చు. బిడియంతో పాటు భాగస్వామి ఏమనుకుంటుందో అనే భయం భర్తలో ఉండొచ్చు. అయితే అందరూ ఒకేలా ఉండాలని లేదు కాబట్టి, అశ్లీల వీడియోలు అనుకరించాలనే ప్రయత్నాలు కూడా జరగవచ్చు. 
 
అలాంటప్పుడు కరకుగా అడ్డు చెప్పడం కంటే సున్నితంగా వారించడం మేలు. లైంగిక అంశాల్లో ఇష్టం లేని వాటిని బలవంతంగా భరించవలసిన అవసరం లేదు. ఒకవేళ ఇష్టం ఉన్నా బిడియం, మొహమాటం అడ్డొస్తూ ఉంటే అప్పటికి వీలు పడదనీ, సహజ పద్ధతుల్లోనే కలుద్దామనీ, క్రమంగా అలవాటు చేసుకుంటాననీ చెప్పి భర్తను అసంతృప్తికి లోనుకాకుండా చేయండి.