శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 12 జులై 2017 (12:12 IST)

ఎమ్మెల్యేలు చనిపోతేనే అభివృద్ధి చేస్తారా?: కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి

అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా నియోజకవర్గాల అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇపుడు ఒక ఎమ్మెల్యే చనిపోతే ఉపఎన్నికలు జరగాల్సి ఉన్నందున అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నార

అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా నియోజకవర్గాల అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇపుడు ఒక ఎమ్మెల్యే చనిపోతే ఉపఎన్నికలు జరగాల్సి ఉన్నందున అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈయన వైకాపా టిక్కెట్‌పై గెలిచి టీడీపీలోకి జంప్ అయ్యారు. 
 
తాజాగా, నంద్యాలలో టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరైనకార్యక్రమంలో ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలకు పదవుల పంట పండిందని, సర్కార్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని.. ఇది చూసి పక్క నియోజకవర్గాల ప్రజలు తమ ఎమ్మెల్యే కూడా పోతే బాగుండని అనుకుంటున్నారన్నారు. 
 
గత మూడేళ్లలో నంద్యాలను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ ఉప ఎన్నికలు రాగానే కాపు కల్యాణ మండపం, రోడ్లు వేయిస్తాం అంటూ కేవలం 10 రోజుల్లోనే రూ.300 కోట్ల మేర అభివృద్ధి పథకాలను సర్కార్ ప్రకటించిందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతేనే సీఎం చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయి, కనుక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని వ్యాఖ్యానించారు. 
 
కేవలం ఎమ్మెల్యేలు పోతే ఉపఎన్నికలు వస్తే బాగుండని ప్రజలు భావిస్తున్నారని, దాదాపు మూడేళ్లకాలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగని నంద్యాల నియోజకవర్గమే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చున్నట్లుగా ఎమ్మెల్యే ప్రసంగించారు. భూమా నాగిరెడ్డి బతికున్నంతకాలం వరకు ఇక్కడ అభివృద్ధిని పట్టించుకోని సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం నంద్యాలకు ఉప ఎన్నికల తరుణంలో స్థానిక నేతలకు పదవులు ఆశ చూపుతున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 
 
ముఖ్యంగా నంద్యాలలో గత మూడేళ్ళలో మూడు ఇళ్లు కూడా కట్టించని ప్రభుత్వం, ఉప ఎన్నికలున్నందున 13 వేల ఇళ్లు కట్టిస్తామని సర్కార్ ప్రచారం చేస్తోంది. వైఎస్ఆర్‌సీపీ టికెట్ మీద గెలిచి టీడీపీలోకి ఎమ్మెల్యేలు ఫిరాయించినా ప్రభుత్వం పట్టించుకోలేదని, కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయి ఉప ఎన్నిక వస్తేనే సీఎం చంద్రబాబు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని భిన్నాభిప్రాయాలను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. క్తమవుతున్నాయి.