బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (14:06 IST)

బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం

కర్నూలు మాజీ మేయర్, తెలుగు దేశం సీనియర్ నేత బంగి ఆనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. బుధవారం ఉదయం ఆయన తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. భార్య, కూతురును కూరగాయల కోసం మార్కెట్‌కు పంపి ఇంట్లో ఉరేసుకునేందుకు ప్రయత్నించారు. 
 
ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన బంగి అనంతయ్యను స్థానికులు గమనించి వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అంతరం ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. రాజకీయంగా తలెత్తిన ఇబ్బందులే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
 
రాజకీయంగా టీడీపీ మోసం చేసిందనే? 
రాజకీయంగా తనను అందరూ మోసం చేశారనే ఆవేదనతోనే బంగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా బంగి ఆనంతయ్య కీలక పాత్ర పోషించారు. 
 
విచిత్ర వేషధారణలతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టే అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశారని తెలిసి తెలుగుదేశం శ్రేణులు షాక్ కు గురయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు బంగి అనంతయ్య ఆత్మహత్య ప్రయత్నానికి దారి తీసిన కారణాలను వాకబు చేశారు.