శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2017 (10:51 IST)

మాజీ ఎమ్మెల్యే కొడుకుతో కలెక్టర్ చెల్లి లేచిపోయిందా? మిస్టరీవీడని సూర్యకుమారి కేసు

విజయవాడకు చెందిన సూర్యకుమారి అనే యువతి మిస్టరీ కేసు ఇంకా వీడలేదు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఈ యువతిని లేపుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ యువతి ఓ కలెక్టర్ చెల్లెలు అనే విషయం తెలిసింది. అలాగే, మాజీ ఎమ్మెల్యే

విజయవాడకు చెందిన సూర్యకుమారి అనే యువతి మిస్టరీ కేసు ఇంకా వీడలేదు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఈ యువతిని లేపుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ యువతి ఓ కలెక్టర్ చెల్లెలు అనే విషయం తెలిసింది. అలాగే, మాజీ ఎమ్మెల్యే కుమారుడికి వివాహమై భార్య, పిల్లలు కూడా ఉన్నారు. విజయవాడ గుణదలలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ ప్రాంతానికి చెందిన సూర్యకుమారి అనే యువతి నూజివీడు సవీపంలోని ఒక పీహెచ్‌సీలో వైద్యురాలిగా పనిచేస్తోంది. ప్రతిరోజూ ఇంటినుంచి కారులో వెళ్లి వస్తుంది. పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్తుంటే సూర్యకుమారి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఈమె మంగళవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. దీనిపై తల్లి కొర్లపాటి మరియమ్మ మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
ఇంటి నుంచి తమ కుమార్తె వెళ్లిన గంట వ్యవధిలోనే ఆమెతో పరిచయం ఉన్న విద్యాసాగర్‌ అలియాస్‌ బాబి తమ ఇంటికి వచ్చి... ‘సూర్యకుమారి సెల్‌ఫోన్‌ ఇచ్చి వెళ్లిపోయాడు’ అని చెప్పినట్లు మరియమ్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విద్యాసాగర్, సూర్యకుమారిలు లేచిపోయివుంటారని భావిస్తున్నారు. 
 
కాగా, విద్యాసాగర్‌ తండ్రి స్వర్గీయ బి.ఎస్.జయరాజు మాజీ ఎమ్మెల్యే. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి 1983-85లో ప్రాతినిధ్యం వహించారు. విద్యాసాగర్‌కు బీసెంట్‌రోడ్డు సమీపంలో జ్యూయలరీషాపు ఉంది. అతడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూర్యకుమారి ప్రతి ఆదివారం స్వరాజ్యమైదానం వద్దగల సీఎస్ఐ చర్చికి ప్రార్థనకు వెళుతుంటుంది. 
 
అదే చర్చిలో పరిచయమైన విద్యాసాగర్‌తో ఆమెకు 2010 నుంచి పరిచయం ఏర్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. విద్యాసాగర్‌తో సూర్యకుమారి లేచిపోయి వుంటుందని ఆయన భార్య శుభ ఆరోపిస్తోంది. 
 
కాగా, సూర్యకుమారి అక్క కర్ణాటకలో కలెక్టర్‌గా పని చేస్తోంది. విజయవాడ క్రీస్తురాజపురంలోని ఫిలింనగర్‌ ఇంటి నుంచి సూర్యకుమారి వెళ్లాక బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, పుష్పాహోటల్‌ ప్రాంతాల్లోని పలు సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అయితే ఆమె ఎటువైపు వెళ్లిందో తెలియరాలేదు. ఆమె వెళ్లిన స్కూటీ వాహనం కూడా ఎక్కడా కనిపించడం లేదు.