శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:53 IST)

ఒక్క ఛాన్స్ జగన్‌కు ఇవ్వడం అంటే వడ్డీతో సహా నడ్డి విరచడమే... జగన్‌ పై లంకా దినకర్ ఫైర్

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క ఛాన్స్ జగన్‌కు ఇవ్వడం అంటే వడ్డీతో సహా నడ్డి విరచడమని ఇప్పుడు ప్రజలకు అర్ధమవుతుందన్నారు.

రాష్ట్రంలో వివిధ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో ఫేక్ చలానాలతో దోపిడీ చేశారని అన్నారు. సచివాలయంలో ఫేక్ పత్రాలతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు.

అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులలో కలెక్షన్స్‌లోనూ దోపిడీ చేశారని తెలిపారు. ప్రభుత్వం వేసిన రోడ్లను తవ్వి కంకర దోపిడీ చేశారని... వీటితో పాటు యెదేచ్ఛగా ఇసుక, సహజవనరులను దోపిడీ చేస్తూ పాలన పాపాలతో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంతో దోపిడీకి లైసెన్సు వచ్చేసింది అని జగన్ అనుకుంటున్నట్లు ఉందన్నారు. 2019 ముందు నంద్యాల, కాకినాడ కార్పోరేషన్ ఏన్నికల విజయాలు వంటివే నేటి స్థానిక సంస్థల ఏన్నికల ఫలితాలు అని లంకా దినకర్ వ్యాఖ్యానించారు.