శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 జులై 2021 (09:24 IST)

అదుపుతప్పి బోల్తాపడ్డ లారీ.. ముగ్గురు మృతి

అదుపుతప్పి లారీ బోల్తాపడటంతో ముగ్గురు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చోటుచేసుకుంది.

గన్నవరం పోలీసులు, ట్రాఫిక్‌ సిబ్బంది ప్రమద స్ధలానికి చేరుకున్నారు. మృతులను తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన ఒకే కుటుంబంలోని రాజ్యలక్ష్మి (29), శ్రీనివాస్‌ (27), రోహిత్‌ (2) లుగా గుర్తించారు.

లారీని క్లీనర్‌ నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది క్రేన్‌ సాయంతో లారీని బయటకు తీస్తున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.