బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 18 అక్టోబరు 2018 (18:53 IST)

పిడుగు పడితే.... విమానం కూలిందంటూ వదంతులు...

చిత్తూరు, నగరంలోని మహాదేవనాయుడు ఇటుకల ఫ్యాక్టరీ సమీపం లోని గుట్ట(చిత్తూరు  ఏస్టేట్) వద్ద విద్యుత్ హై పవర్ లైన్ పైన పిడుగు పడటంతో అక్కడి కొండపై పేలుడు శబ్దం వచ్చింది. విద్యుత్ తీగ పడటంతో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ విమానం కూలిపోయిందంటూ వదంతులు చెలరేగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
అప్రమత్తమైన పోలీసులు తిరుపతి విమానాశ్రయంలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ను సంప్రదించారు. అలాంటి ప్రమాదమేమీ అసలు లేదని వారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పిడుగు పాటుకు విద్యుత్ తీగ పడటంతో మంటలు చెలరేగి అక్కడి చెట్లు కాలిపోయి కొద్దిసేపటికే మంటలు ఆరిపోయాయి. 
 
సోషల్ మీడియాలో కొన్ని విషయాల్లో చోటుచేసుకుంటోన్న అవాస్తవ ప్రచారాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఎస్పీ రాజశేఖర్‌ బాబు సూచించారు.