శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (14:36 IST)

తిరుమలలో కరోనా కేసులు.. స్వచ్ఛంధ లాక్‌డౌన్?

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో పరిస్థితి రోజు రోజుకు మారిపోతుంది. కరోనా తీవ్రత ప్రజల తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో కరోనా తీవ్రత అధికంగా ఉందని, ప్రజల సహకారంతోనే కరోనా జయించగలుగుతామని అన్నారు.
 
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరవాలని అన్నారు. అత్యవసర పనులు ఉంటేనే ప్రజలు బయటకు రావాలని అన్నారు. రేపటి నుంచి మధ్యాహ్నం 2 గంటల తరువాత దుకాణాలు మూసివేయాలని తెలిపారు.
 
తిరుపతి మార్కెట్‌ను నగరంలో 7,8 చోట్ల డీ సెంట్రలైజ్ చేస్తున్నామని అన్నారు. రాయలసీమలోనే అతిపెద్ద జాతర గంగమ్మ జాతర ఏకాంతంగా జరపాలని నిర్ణయించినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు.