ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2024 (08:33 IST)

Rain Alert to AP ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీకి వర్ష సూచన

rain
Low Pressure to Create Today in Bay Of Bengal ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోమారు వర్షపు ముప్పు పొంచివుంది. ఇటీవల వచ్చిన ఫెంగల్ తుఫాను కారణంగా విస్తారంగా వర్షాలు కురుసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇపుడు మరోమారు వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొంది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈ నెల 12వ తేదీ నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 11, 12వ తేదీల్లో తమిళనాడులో, 12వ తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, అల్పపీడనం వాయుగుండం మారే అవకాశం కూడా ఉందని ఐఎండీ వెల్లడించింది.