శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (16:06 IST)

శివుని సన్నిధిలో మరోసారి వార్తల్లోకెక్కిన గాలిజనార్థన్ రెడ్డి...ఎలా..?

ప్రముఖ పారిశ్రామికవేత్త గాలిజనార్థన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి దర్శనం కోసం గంటల తరబడి సామాన్య భక్తులు క్యూలైన్లలో వేచి ఉంటే గాలిజనార్థన్ రెడ్డి మాత్రం కుటుంబ సమేతంగా గంటకుపైగా ఆలయంలో గడపటం తీవ్ర వి

ప్రముఖ పారిశ్రామికవేత్త గాలిజనార్థన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి దర్శనం కోసం గంటల తరబడి సామాన్య భక్తులు క్యూలైన్లలో వేచి ఉంటే గాలిజనార్థన్ రెడ్డి మాత్రం కుటుంబ సమేతంగా గంటకుపైగా ఆలయంలో గడపటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గాలిజనార్థన్ రెడ్డిని దగ్గరుండి మరీ స్థానికంగా ఉన్న బిజెపి నేత కోలా ఆనంద్ తీసుకెళ్ళడం, దేవస్థానం అధికారులు వారిస్తున్నాసరే స్వామివారు, అమ్మవారి చెంత గంటల తరబడి నిలబెట్టి సామాన్య భక్తులకు అసౌకర్యం కలిగించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 
 
కోలా ఆనంద్ స్థానిక బిజెపి నేత కావడంతో పాటు దేవదాయశాఖా మంత్రి మాణిక్యాలరావుకు అత్యంత సన్నిహితుడు కావడంతో దేవస్థానం ఈఓ భ్రమరాంబ కూడా చూసీచూడనట్లు వదిలేశారు. గాలి జనార్థన్ రెడ్డి కంటే ముందు చాలామంది ప్రముఖులు వచ్చినా విఐపి క్యూలైన్‌లో దర్శనానికి పంపకుండా ఆపేశారు ఈఓ భ్రమరాంబ. బిజెపి నేత కోలా ఆనంద్ వచ్చిన తరువాత మాత్రం క్యూలైన్ వద్ద నుంచి దూరంగా వెళ్లిపోయారు.