శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 డిశెంబరు 2017 (09:46 IST)

బంగారు కుర్చీలు, బంగారు కంచాలన్నీ గాలి వార్తలే: జనార్ధన్ రెడ్డి

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన ఇంట్లో బంగారు కుర్చీలు, బంగారు కంచాలున్నాయని జరుగుతున్న ప్రచారం అంతా గాలి వార్తలేనని చెప్పారు. ఆ వార్తల్లో ఎలాంటి

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన ఇంట్లో బంగారు కుర్చీలు, బంగారు కంచాలున్నాయని జరుగుతున్న ప్రచారం అంతా గాలి వార్తలేనని చెప్పారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తన నుంచి ఏం సీజ్ చేశారో ఆ వివరాలు సీబీఐ దగ్గర వుందని తెలిపారు. తన ఆస్తి అందరూ అనుకున్నట్టు లక్ష కోట్లకు పైగా ఏమీ లేదని, కొన్ని వందల కోట్లే ఉన్నాయని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. 
 
తన కుమార్తె పెళ్లికి రూ.30కోట్లు వరకే ఖర్చు చేశామని.. రూ.400 కోట్లు, 500 కోట్లని వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని గాలి జనార్ధన్ రెడ్డి కొట్టిపారేశారు. యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్‌ మాల్యాలా తాను వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోలేదని తెలిపారు. తాను ఏ తప్పూ చేయలేదని.. కర్ణాటకలో బీజేపీకి ప్రజల మధ్య ఆదరణ లభించడంతో యూపీఏ సర్కారు నాలుగేళ్ల పాటు తనను జైలులో పెట్టించిందని గాలి వ్యాఖ్యానించారు. 
 
దివంగత సీఎం వైఎస్సా‌ర్‌‍కు, తనకు మధ్య ఉన్నది ఓ వ్యాపారవేత్తకు, ప్రభుత్వాధినేతకు మధ్య ఉండేటువంటి సంబంధమేనని గాలి స్పష్టం చేశారు. ప్రస్తుతం వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి విషయంలో తలదూర్చనని  తేల్చేశారు. తన రాజకీయాలు కర్ణాటకకు మాత్రమే పరిమితమని వెల్లడించారు.