1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 మే 2025 (13:26 IST)

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

malavika mohan
హీరో ప్రభాస్‌పై తనకున్న అభిప్రాయం తప్పని ఆయనతో కలిసి జర్నీ చేసిన తర్వాత తెలుసుకున్నట్టు హీరోయిన్ మాళవికా మోహనన్ అన్నారు. ముఖ్యంగా, ప్రభాస్ సైలెంట్‌గా ఉంటారని అనుకున్నారనని కానీ ఆయన అలాంటి వ్యక్తికాదని, ఆయన సెట్‌లో ఉంటే ఆ కిక్కే వేరబ్బా అని చెప్పుకొచ్చారు. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రభాస్‌తో కలిసి "ది రాజాసాబ్" అనే చిత్రంలో నటించినట్టు చెప్పారు. ఆ సమయంలో ప్రభాస్ గురించి అనేక విషయాలు తెలుసుకున్నట్టు తెలిపారు. 
 
"ప్రభాస్‌ను కలవక ముందు, పలు ఇంటర్వ్యూల్లో ఆయన్ని చూసి తన ఇతరులతో పెద్దగా కలవరనుకున్నా... చాలా సెలెంట్‌గా ఉంటారనిపించింది. కానీ, ఈ సినిమా వల్ల ఆయన విషయంలో నా ఆలోచన తప్పని అర్థమైంది. ఆయన ఎంతో సరదాగా ఉంటుంది. ఒక్క డల్ మూమెంట్ కూడా ఉండదు" అని మాళవికా మోహనన్ అన్నారు. ఈ సినిమా టీజర్ అతి త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు.