శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (22:47 IST)

భార్యమీద కోపం.. అనుమానం.. పిల్లలను కెనాల్‌లో పడేసి..

crime scene
భార్యమీద కోపంతో పిల్లలను కెనాల్‌లో పడేసి హతమార్చాడో తండ్రి. ఈ దారుణం తాడేపల్లి మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. భార్య మీద అనుమానంతో  ముక్కు పచ్చలారని తన పిల్లలను కుంచనపల్లిలోని బకింగ్‌హాం కెనాల్‌లో పడేశాడు.
 
తమ పిల్లలు జోష్ణ (6) షణ్ముఖ వర్మ (4) నిన్నటి నుంచి కనిపించడం లేదని పెద్దకాకాని పోలీస్ స్టేషన్‌లో తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తండ్రే పిల్లలను చంపేసినట్టు వారి విచారణలో తెలిపింది.
 
గజ ఈతగాళ్ల సహాయంతో బకింగ్ హామ్ కెనాల్‌లో సెర్చ్ చేయగా.. ఇద్దరి చిన్నారుల మృతదేహాలు దొరికాయి. దీనిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.