గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (11:12 IST)

అత్తపై అల్లుడి అత్యాచారం.. కన్నేసి మాయమాటలు చెప్పి.. రాత్రిపూట?

అత్తపైన ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. పిల్లనిచ్చిందనే కనికరం లేకుండా అత్తపై అల్లుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అల్లుడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు ప్రయత్నించినా వీలు కాకపోవడంతో అతడి అన్యాయానికి బలైపోయింది 
 
వివరాల్లోకి వెళితే.. పాతబస్తీ కందికల్ బస్తీకి చెందిన ఓ మహిళ(45) తన కూతురిని బాలాపూర్ చౌరస్తాలో ఉండే భాస్కర్(28) అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేసింది. భాస్కర్ ఆర్టీసీ అద్దె బస్సులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పిల్లనిచ్చిన అత్తపైనే కన్నేసిన భాస్కర్ బుధవారం రాత్రి బయట పని ఉందని చెప్పి ఆమెను బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. బాలాపూర్ రోడ్డులోని గుర్రం చెరువు కట్టపైకి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అనంతరం బాధితురాలిని ఇంటి వద్ద దించేసి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నీ కూతురిని వదిలేస్తానని బెదిరించాడు. అయితే అత్త చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.