గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (13:29 IST)

మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు

మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ మంగళగిరి బస్ స్టాండ్ వద్ద తెదేపా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మంగళగిరి ఎమ్యెల్యే రాజీనామా చేసి రైతులపక్షాన పోరాడాలని డిమాండ్ చేశారు. రాజధానికి స్వచ్చందంగా భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. జాతీయ జెండాలతో నిరసనలో నేతలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా టైర్లను తగులపెట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా పూర్వ ఇంచార్జిలు పోతినేని శ్రీనివాసరావు, గంజి చిరంజీవి, నందం అబదయ్య, ఆరుద్ర భులక్ష్మి, కొమ్మారెడ్డి కిరణ్,సంకా బాలాజీ గుప్తా, మన్నెం రమేష్, పొలవరపు హరిబాబు, గోవాడ దుర్గారావు, రవి తెదేపా నాయకులు తదితరులు నిరసనలో పాల్గొన్నారు. నిరసన వలన ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.