గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 మే 2020 (18:39 IST)

మంగళగిరి తెదేపా ప్రధాన కార్యాలయానికి కరోనా నోటీసులు!

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో వుంది. ఈ భవనాన్ని కొత్తగా నిర్మించారు. ఈ భవనం నుంచి పార్టీపరంగా అన్ని రకాల కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ కార్యాలయానికి కోవిడ్ నోటీసులు జారీచేశారు. 
 
మహానాడు జరుగుతున్నందున కార్యాలయంలో కరోనా నివారణ చర్యలను తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. మంగళగిరి తహసీల్దార్ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. టీడీపీ కార్యాలయ సెక్రటరీ రమణకు ఆత్మకూరు వీఆర్వో ఈ నోటీసులు అందించారు.
 
కాగా, బుధవారం, గురువారం రెండు రోజుల పాటు తెదేపా మహానాడు జరుగుతున్న విషయం తెల్సిందే. అయితే, కరోనా నేపథ్యంలో ఈ మహానాడును కూడా డిజిటల్ మహానాడుగా జూమ్ యాప్‌లో నిర్వహిస్తోంది. 
 
దీంతో పార్టీ శ్రేణులంతా తమతమ ఇళ్ళలో ఉంటూ ఈ మహానాడును ఆన్‌లైన్‌లో వీక్షిస్తున్నారు. కాగా, ఎన్టీఆర్ జయంతి వేడుకలు మే 28వ తేదీని పురస్కరించుకుని ఈ మహానాడును ప్తి యేటా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.