చంద్రబాబును చంపేస్తాం - మావోయిస్టుల రెక్కీ..?
ఇప్పటికీ అలిపిరి బాంబు దాడిని తలుచుకుంటే వణికిపోతుంటారు చంద్రబాబు. చావుకు దగ్గరగా వెళ్ళి చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే మళ్ళీ మావోయిస్టులు చంద్రబాబును టార్గెట్ చేశారట. ఆయనపై రెక్కీ నిర్వహించారా అంటే అవుననే అంటున్నాయి ఎపీ ఇంటలిజెన్స్ వర్గాలు.
ఇప్పటికీ అలిపిరి బాంబు దాడిని తలుచుకుంటే వణికిపోతుంటారు చంద్రబాబు. చావుకు దగ్గరగా వెళ్ళి చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే మళ్ళీ మావోయిస్టులు చంద్రబాబును టార్గెట్ చేశారట. ఆయనపై రెక్కీ నిర్వహించారా అంటే అవుననే అంటున్నాయి ఎపీ ఇంటలిజెన్స్ వర్గాలు.
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై తిరుమల కొండకు సమీపంలో దాడి చేశారు. అయితే ఆ దాడిలో ఆయన స్వల్పంగా గాయపడి ప్రాణాలను కాపాడుకున్నారు. తాజాగా ఆయనను చంపేందుకు మావోయిస్టులు ఢిల్లీలో రెక్కీ నిర్వహించిన ఘటన మరవక ముందే ఇప్పుడు ఆయన జూబ్లిహిల్స్‌లోని కొత్త ఇంట్లో కూడా ఓ అగంతక మహిళ రెక్కీ నిర్వహించడానికి ప్రయత్నించిందని సమాచారం.
జూబ్లిహిల్స్‌లో నూతన గృహంలోకి చంద్రబాబు దంపతులు ఈ నెల 9, 10 తేదీల్లో ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 25 నుంచి 30 ఏళ్ళున్న ఓ మహిళ చంద్రబాబు ఇంట్లోకి ప్రవేశించి చకచకా తన సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసేందుకు ప్రయత్నం చేసిందని సమాచారం. అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ అధికారులు అనుమానించి ఆ మహిళను తమ ఆధీనంలోకి తీసుకుని విచారించగా తాను చంద్రబాబు కోడలు బ్రాహ్మణి స్నేహితురాలినని, ఆమె ఆహ్వానం మేరకే వచ్చానని చెప్పినదని సమాచారం. కానీ ఆమె మాట్లాడే సమయంలో తడబడటంతో స్థానిక పోలీసులను రప్పించి విచారించడంతో అసలు విషయం బయటపడింది.
చంద్రబాబు ఇంట్లోకి ప్రవేశించిన ఆ మహిళకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, చంద్రబాబు కదలికలపై ఆరా తీసేందుకే ఆమె వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై బ్రాహ్మణి వద్ద ప్రస్తావించగా తన స్నేహితులు ఎవరినీ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానించలేదని ఆ అగంతకురాలు చెబుతున్న మాటల్లో ఎటువంటి వాస్తవం లేదని చెప్పినట్టు సమాచారం. మావోయిస్టుల్లో కొందరు ఆత్మాహుతి దళాలుగా ఏర్పడి చంద్రబాబును అనుసరించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి కేంద్ర నిఘా వర్గాలు ఇంతకుమునుపే హెచ్చరించాయి. దీంతో చంద్రబాబుకు ఏపీ పోలీసులు ఐదంచెల భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ఆయనను కలిసేందుకు వచ్చే ముఖ్యులను నిశితంగా పరిశీలించాకే అనుమతిస్తున్నారు.