శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

చెల్లిపై అత్యాచారం... గర్భందాల్చడంతో వెలుగులోకి

తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. వరుసకు అన్న అయ్యే ఓ కామాంధుడు చెల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ తంతు గత కొన్నేళ్లుగా సాగుతూ వస్తోంది. ఈ క్రమంలో బాలిక గర్భందాల్చడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఈ దారుణం నర్సాపూర్ రూరల్ మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నర్సాపూర్‌ పట్టణంలోని పోస్టాఫీస్‌ వీధిలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక(14)పై ఇదే వీధిలో నివసించే వరుసకు అన్న అయిన యువకుడు (22) కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
బాలిక గర్భం దాల్చడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శనివారం బాలికతో కలిసి ఐసీడీఎస్‌ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. బాలికను ప్రస్తుతం చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సెక్టార్‌ (బాలికల సంరక్షణ కేంద్రం)కు అప్పగించనున్నట్లు సీడీపీఓ తెలిపారు. ఎస్‌ఐ గంగారాజ్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందలేదన్నారు.