నేటి నుంచి ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం షార్ట్ మార్కుల మెమోలను ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి పేర్కొంది.
ఈ మేరకు మండలి సెక్రటరీ వి.రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు మెమోలు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
ప్రథమ సంవత్సరం ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థుల మార్కుల మెమోలు ఆగస్టు 1న మధ్యాహ్నం ఒంటి గంటకు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని, విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.