బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (08:36 IST)

నవంబర్ 23 నుంచి సూర్యలంకలో మిలటరీ శిక్షణ

నవంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ నాలుగో తేదీ వరకూ 12 రోజుల పాటు రక్షణ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. 
 
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తున్నట్లు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీచేశారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ శిక్షణా కార్యక్రమాలు జరగనున్నాయి.
 
సూర్యలంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా కాల్పుల శిక్షణ జరగనుంది. రోజుకు రెండు పర్యాయాలకు పైగా కాల్పుల శిక్షణ ఉంటుంది. 6 నుంచి 8 ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొననున్నాయి. 
 
శిక్షణ జరిగే సూర్యలంక చుట్టు పక్కల 100 కిలో మీటర్ల వరకూ ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.