శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి : అసదుద్దీన్

ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అంతేకాకుండా, దేశం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా తాను సిద్ధమన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలప ఆయన స్పందించారు. 
 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన తర్వాత దేశ పౌరులుగా నిరూపించుకోవాల్సి రావడం దారుణమన్నారు. దీనిని కేవలం హిందూ, ముస్లిం సమస్యగా చూడరాదని, దేశానికి ప్రజలకు మధ్య ఉన్న సమస్యగా దీనిని చూడాలని ఒవైసీ అన్నారు. 
 
ఎన్ఆర్‌సీ వల్ల దేశానికి నష్టమే తప్ప లాభం లేదన్నారు. ఎన్ఆర్‌సీని కనుక అమలు చేస్తే దేశంలో చాలా వరకు రాష్ట్రాలు ఖాళీ అయిపోతాయన్నారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఒవైసీ అన్నారు. దేశంలోని ప్రతీ ముస్లిం ఇంటిపైనా జాతీయ జెండా ఎగరడాన్ని మోదీ, షాలు చూడాలని అన్నారు.