మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (10:20 IST)

సమస్యకు హింస పరిష్కారం కాదు : క్యాబ్‌పై రజినీకాంత్ ట్వీట్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా, రాజధాని ఢిల్లీతో పాటు... ఈశాన్య రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో క్యాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆందోళనల్లో భాగంగా పలు రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. 
 
ఈనేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ హింసంపై స్పందించారు. "సమస్యకు హింస పరిష్కార మార్గం కాకూడదని వ్యాఖ్యానించారు. జాతి, సమగ్రత, ఐక్యతను దృష్టిలో ఉంచుకుని.. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న హింస బాధ కలిగిస్తోందని.. ప్రజలంతా శాంతియుతంగా ఐక్యతతో ఉండాలి" అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.