హిజ్రా పాత్రలో చేయాలని వుంది : రజినీకాంత్
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తన మనసులోని కోరికను వెల్లడించారు. ఆయన నటించిన తాజా చిత్రం "దర్బార్". ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. అయితే, తన సినీ కెరీర్‌లో ఎన్నో పాత్రలు చేసిన రజినీకాంత్‌కు ఇంకా ఓ పాత్ర చేయలేదన్న అసంతృప్తి ఉన్నట్టు వెల్లడించారు. ఆ పాత్ర ఏంటో కాదు.. హిజ్రా పాత్ర. ట్రాన్స్‌జెండ్ పాత్రలో చేయాలని వుందని తనలోని మనోగతాన్ని వెల్లడించారు.
రజినీకాంత్ తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకు 167 సినిమాలు చేశారు. అనేక పాత్రల్లో మెప్పించారు. వీటిలో ఎక్కువగా పోలీస్ పాత్రలో ఉన్నాయి. ఇపుడు రెండున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ దర్బార్ చిత్రంలో పోలీస్‌గా నటించారు. ఈ చిత్ర ట్రైలర్ వేడుక తాజాగా జరిగింది.
ఇందులో రజినీకాంత్ స్పందిస్తూ, ఇప్పటివరకూ ట్రాన్స్‌జండర్ క్యారెక్టర్ చేయలేదని, అటువంటి పాత్ర పోషించాలనుకుంటున్నానని తెలిపారు. పోలీస్ క్యారెక్టర్స్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు. అందులో చాలా సీరియస్‌నెస్ ఉంటుంది. క్రిమినల్స్ వెంట పరిగెత్తాలి. అందుకే ఇలాంటి పాత్రలలో చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందన్నారు. అయినప్పటికీ... మంచి కథలు వచ్చినప్పడు పోలీస్ పాత్రల్లో నటించక తప్పడం లేదన్నారు.