1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2015 (17:07 IST)

అజం చర్య ప్రమాదకరం..లేఖ రాసి తప్పు చేశారు: ఓవైసీ

ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ ఘటన నేపథ్యంలో భారతదేశంలో ముస్లింల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాజ్ వాదీ పార్టీ నేత అజంఖాన్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాయడంపై ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. సమస్యను దేశంలోనే పరిష్కరించుకోకుండా ఐరాస దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

మొత్తానికి అజంఖాన్ చర్య ప్రమాదకరమైందన్నారు. అసలు తప్పంతా యూపీ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. ముస్లింలకు భద్రత కల్పించలేకపోతున్న యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ అసమర్థత వల్లే ఇదంతా జరిగిందని ఓవైసీ విమర్శలు గుప్పించారు.
 
ఇదిలా ఉంటే.. యూపీలో దాద్రి గ్రామంలో గోమాంసం తిన్నాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తిని గ్రామంలోని బీజేపీ నేత కుమారుడు, అతని అనుచరులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలే ఉత్తరప్రదేశ్‌లోని మరిన్ని చోట్ల పునరావృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న సమాచారం తమ వద్ద ఉందని సమాజ్ వాదీ పార్టీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనను రాజకీయం చేయాలని తాము భావించడం లేదని సమాజ్ వాదీ పార్టీ స్పష్టం చేసింది.