శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 జులై 2021 (02:52 IST)

అవినీతిలో మునిగితేలుతున్న మంత్రి జయరామ్ :టీడీపీ

కార్మికులే తనకు ప్రధానమైనవారని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్మోహన్ రెడ్డి నైజం అధికారంలోకి వచ్చాక, వారి ని దోపిడీచేసేవిధంగా మారిపోయిందని, భవనినిర్మాణ కార్మి కుల సంక్షేమనిధినుంచి రూ.750కోట్లు పక్కదారి పట్టించి, వారి కడుపుకొట్టిన ఘనత ఈ ముఖ్యమంత్రిదేనని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు. చంద్రబాబుప్రభుత్వం భవననిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అనేకపథకాలు ప్రవేశపెట్టిందని, వారు చనిపోతే మట్టిఖర్చులకు రూ.15వేలు, ప్రమాదవశా త్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షలను చంద్రన్నబీమా కింద అందచేసిందన్నారు. అలానే కార్మికుల భార్యలకు ప్రసవం ఖర్చులకోసం రూ.40వేలు అందచేశారని రఫీ తెలిపారు.

నిర్మాణపనిచేస్తూ భవననిర్మాణ కార్మికులు, లేదా కూలీలుఎవరైనా భవనాలపై నుంచి ప్రమాదవశాత్తూ పడిపోతే, నెలకు రూ.3వేలచొప్పున వైద్యఖర్చులకు చంద్ర బాబు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. వివిధరకాల కార్మికులకు రూ.5కే భోజనంపెట్టే అన్నాక్యాంటీన్లను టీడీపీప్రభుత్వం నిర్వహించిందన్నారు. ఆ విధంగా అనేకవిధాలుగా చంద్రబా బునాయుడు భవననిర్మాణకార్మికులకు అండగా నిలిస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చీరాగానే ఇసుకదొరక్కుం డాచేసి, వారికి పనే లేకుండాచేశాడని రఫీ తెలిపారు.

ఆకలి కేకలతో అన్నమోరామచంద్రా అని కార్మికులు విలపించేలా వారికుటుంబాలు రోడ్డునపడేలా చేసింది ఈప్రభుత్వమేన న్నారు. కార్మికులనుంచి సెస్ కింద వసూలుచేసే రూపాయి సొమ్ముతో వారుఏర్పాటుచేసుకున్న సంక్షేమ సంఘంనిధి లోని రూ.1200కోట్ల సొమ్ములోనుంచి కూడా వారిసంక్షే మానికి జగన్మోహన్ రెడ్డి నిధులివ్వడంలేదన్నారు. 

జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఇసుకపాలసీవల్ల దాదాపు 60 మంది కార్మికులుచనిపోయినాకూడా, వారి కుటుంబాలకు ఈప్రభుత్వం కనీసం రూపాయికూడా సాయం చేయలేదన్నారు. ఉన్న సంక్షేమపథకాలను రద్దుచేసింది కాక, కార్మికులకు ఎలాంటి పథకాలు అమలుచేయకుండా ఈముఖ్యమంత్రి కార్మికుల ద్రోహిగా మిగిలిపోయాడని రఫీ మండిపడ్డారు.

కార్మికుల సొమ్ము రూ.750కోట్లను ఎవరైతే కాజేశారో, వారిని కఠినంగా శిక్షించాలని, జరిగిన ఘటనకు నైతికబాధ్యతవహిస్తూ, కార్మికశాఖామంత్రి గుమ్మనూరు జయరామ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. కార్మికులుసొమ్ము పక్కదారి పడుతుంటే, ప్రతిఘటించకుండా మంత్రి ప్రేక్షకపాత్ర వహించడమేంటన్నారు?

ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు కరోనా కారణంగా లాక్ డౌన్ వస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఏపీలో కార్మికులకు లాక్ డౌన్ మొదలైందన్నారు. ఇసుకపాలసీ పేరుతో 6నెలలు ఇసుకతవ్వకాలు, రవాణా నిలిపేసిన ముఖ్యమంత్రి, తనఖజానా నింపుకోవడానికి అవసరమైన మద్యం అమ్మకాలను మాత్రం ఒక్కరోజు కూడా రాష్ట్రంలో ఆపిందిలేదన్నారు.   

కరోనానిధులను దుర్విని యోగం చేసినప్రభుత్వం, అన్నిశాఖల్లో అత్యవసరాలకోసం వినియోగించాల్సిన నిధులను ఇష్టానుసారం దారి మళ్లించిం దన్నారు.  ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ కార్పొరేషన్ నిధులను కూడా జగన్ ప్రభుత్వం వదల్లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరి గిందని కార్మికలోకం గగ్గోలుపెడుతోందన్నారు. కార్మికుల వేదన, రోదనకూడా పట్టించుకోకుండా ఆశాఖ మంత్రి అవినీ తిలో మునిగితేలుతున్నాడన్నారు.

కార్మికులసొమ్ముని వారికి అందేలాచేయాల్సిన బాధ్యత ఈప్రభుత్వానిదేనని, వారికి ముఖ్యమంత్రిన్యాయంచేయకుంటే, తెలుగుదేశంపార్టీ కార్మికులపక్షానకలిసి పోరాడుతుందని, అవసరమైతే తాడే పల్లి ప్యాలెస్ ముట్టడికి సిద్ధమవుతుందని రఫీ హెచ్చరించా రు. పత్రికల్లో ప్రకటనలు తప్ప, ప్రభుత్వం ఏవర్గానికి ఏమీ చేసిందిలేదన్నారు. అసంఘటిత కార్మికులకోసం గతప్రభు త్వం అమలుచేసిన అనేకపథకాలను జగన్ ప్రభుత్వం తీసే సిందన్నారు.

చంద్రన్నబీమా రద్దుచేయడం ద్వారా ఈ ప్రభుత్వం కార్మికుల ఉసురుపోసుకుందన్నారు. ఆర్టీసీని ప్రభు త్వంలో విలీనంచేశామనిచెప్పిన ప్రభుత్వం, సదరుసంస్థలో ని ఉద్యోగులకు కన్నీళ్లే మిగిల్చిందన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు దక్కాల్సిన నిధులను ప్రభుత్వం దారి మళ్లించడం దారుణమన్నరఫీ, తక్షణమే రూ.750కోట్ల నిధులను నెలరోజుల్లో కార్మికులసంక్షేమ సంఘంనిధికి జమచేయాలన్నారు.

కార్మికశాఖామంత్రికి అవినీతిపై ఉన్నశ్రద్ధ, కార్మికులసంక్షేమంపై లేదన్నారు. ముఖ్యమంత్రి మెప్పుపొందడం కోసం కార్మికశాఖామంత్రి చివరకు కార్మికు లను బలిచేస్తున్నాడన్నారు. కార్మికులసొమ్మును దారి మళ్లించే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని కార్మికలోకం ఆగ్రహం వ్యక్తంచేస్తోందని, వారితరుపున తెలుగుదేశంపార్టీకూడా నిధుల దారిమళ్లింపుపై పాలకులను ప్రశ్నిస్తోందన్నారు.