సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2023 (19:25 IST)

మీ డాడీ కేడీ కాబట్టే అరెస్టయ్యాడు.. అందుకే జైలుకు..?

rk roja
టీడీపీ అధినేత చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే అరస్టయ్యారని.. అవినీతికి పాల్పడిన వ్యక్తిని జైలుకు పంపించకుండా ఎక్కడకు పంపిస్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన ట్వీట్‌కు మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. 'పిచ్చోడు లండన్‌కి... మంచోడు జైలుకి... ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం' రోజా తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ సంతోషంగా ఉంటుందని చెప్పారు. 
 
'ఓ పిల్ల సైకో లోకేశ్... మీ డాడీ కేడీ కాబట్టే అరెస్టయ్యాడు' అంటూ విమర్శలు రోజా గుప్పించారు. మీ నాన్న మంచోడు కాదని, సూట్ కేసు కంపెనీలతో ముంచేసినోడని తెలుసుకో అన్నారు. ఇలాంటి కరప్షన్ కింగ్‌ను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా? అని ఎద్దేవా చేశారు. ఓ పప్పూ.. మీ నాన్న తుప్పు కాదు నిప్పు అయితే కనుక ఈ కుంభకోణంలో విచారణ జరుపుకోండని ధైర్యంగా చెప్పు అంటూ లోకేశ్‌కు సవాల్ చేశారు.