శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శనివారం, 4 సెప్టెంబరు 2021 (14:41 IST)

దేవాదాయ మంత్రికి స్వరూపానందేంద్ర స్వామి సూచనలు

దేవాదాయ శాఖ నిర్వహణలో భాగస్వామ్యమయ్యేలా, ఆగమ సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. సలహామండలి సూచనలతో ఆలయాల నిర్వహణలో మార్పులు చేపట్టాలని తెలిపారు.

చాతుర్మాస్య దీక్ష చేపట్టిన పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రిషికేష్ వెళ్ళి శనివారం కలిశారు. పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్నారు. 
 
 
రిషికేష్ వద్ద గంగాతీరంలో పవిత్ర స్నానమాచరించి పూజలు నిర్వహించారు. విశాఖ శ్రీ శారదాపీఠం రిషికేష్ ఆశ్రమంలో శ్రీ శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుల పీఠార్చనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖకు సంబంధించిన అనేక అంశాలను, సమస్యలను స్వామి స్వరూపానందేంద్ర దేవాదాయశాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దేవాదాయ శాఖలో విస్తృతంగా మార్పులు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఆలయాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్నందున నిర్వహణలో లోపాలు తలెత్తే అవకాశాలున్నాయని మంత్రి వెల్లంపల్లికి సూచ‌న‌లు చేశారు.