శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 11 జనవరి 2019 (14:41 IST)

సమాజం మంచిది కాదు.. మనం సుఖంగా ఉండలేం.. వదిన-మరిది సూసైడ్

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాల్లో వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. తాము చేస్తున్న పాడుపనికి ఈ సమాజం అంగీకరించదనీ, అలాంటపుడు మనం సుఖంగా ఉండలేమంటూ వదిన - మరిదిలు కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఆత్మహత్య కేసు వివరాలను పరిశీలిస్తే... నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం, జాలూబాయ్ తండాకు చెందిన ధీరావత్ సాలు (28) అనే మహిళకు తన మరిది ధీరావత్ భాస్కర్(28)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తతో పాటు కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. 
 
అదేసమయంలో భార్య సాలును భర్త మందలించాడు. దీంతో భాస్కర్ దూరమవుతాడని భావించిన సాలు... అతనితో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మిర్యాలగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.