మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 24 మే 2021 (14:12 IST)

కోవూరు ఎమ్మెల్యే కి తప్పిన ముప్పు

మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వాహనం సోమవారం రోడ్డు ప్రమాదానికి గురైంది.

కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఇనమడుగులో ఓ కార్యక్రమానికి వచ్చేందుకు ఆయన నెల్లూరు నుంచి బయలుదేరి జాతీయ రహదారి నుంచి  ఇనమడుగు వెళ్లే ప్రాంతం సమీపానికి వచ్చేసరికే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ లారీ ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తోపాటు విజయ డైయిరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ డీ. నిరంజన్ బాబు రెడ్డి లు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఎవరికీ అంతగా గాయాలు కాలేదు.. ప్రమాదం విషయం తెలుసుకున్న కోవూరు పోలీసులు ఆగమేఘాల మీద ఇనమడుగుకు చేరుకొన్నారు