ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 మార్చి 2017 (10:12 IST)

‘ఏయ్‌ కలెక్టర్‌.. ఏమిటిది?’... 'డోంట్ టాక్'... మంత్రుల సాక్షిగా ఎమ్మెల్యే, కలెక్టర్‌ వాగ్వాదం

తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల సాక్షిగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ‘ఏయ్‌ కలెక్టర్‌.. ఏమిటిది?’ అంటూ మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ నిలదీస్తే.. ‘డోంట్

తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల సాక్షిగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ‘ఏయ్‌ కలెక్టర్‌.. ఏమిటిది?’ అంటూ మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ నిలదీస్తే.. ‘డోంట్‌ టాక్‌..’ అంటూ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ గద్దించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, ఈటల రాజేందర్‌ల సాక్షిగా వాగ్వాదానికి దిగారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో బుధవారం డిజి ధన మేళా సందర్భంగా ప్రొటోకాల్‌ విషయమై ఈ రగడ రేగింది. వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్‌లో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రులు ఈటల, కేటీఆర్‌ ఫోటోలను మాత్రమే ముద్రించారు. 
 
కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఫొటోలను ముద్రించకపోవడంతో వివాదానికి దారితీసింది. ఆ సమయంలో ఎమ్మెల్యే రసమయి, కలెక్టర్ సర్ఫరాజ్‌ల మధ్య ఈ వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత మంత్రి ఈటల రాజేందర్ జోక్యం చేసుకుని వారిద్దరిని శాంతపరిచారు.