బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 29 మే 2021 (22:48 IST)

పాలనలో జగనన్న మహాద్భుతం: రోజా వ్యాఖ్యలు

పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి మహాద్బుతమన్నారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా. ఎపిలో ముఖ్యమంత్రిగా రెండేళ్ళ పాలన త్వరలో జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసుకోబోతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్న వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిందన్నారు.
 
జగనన్నపై ప్రజలు పెట్టుకున్న ఆశ, ఆకాంక్ష రెండూ నెరవేరుతున్నాయని.. అభివృద్థి, సంక్షేమంలో రాష్ట్రం పరుగులు పెడుతోందన్నారు. కరోనా క్లిష్టమైన సమయంలోను ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించిన ఘనట ముఖ్యమంత్రిదేనన్నారు.
 
గత ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన కన్నా జగన్ పాలన ఎంతో బేష్‌ అంటూ అందరూ మెచ్చుకుంటున్నారని.. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్సలు చేయడం మానుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు దరిచేరడంతో పాటు వారి ఇబ్బందులను తొలగిస్తున్న ఇంటి పెద్దగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారంటూ కొనియాడారు.