జలకళ.. రోజా ముఖంలో వెన్నెల (video)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా సొంత నియోజకవర్గంలో జరిగే అభివృద్థి కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఏదో ఒక అభివృద్థి కార్యక్రమంతో జనంలోకి వెళుతున్నారు రోజా. ప్రభుత్వ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తూ నగరి నియోజకవర్గాన్ని అభివృద్థి పథంలోకి తీసుకెళుతున్నారు.
నగరిలోని సత్రవాడలో తాగునీటి సమ్మర్ స్టోరేజ్‌లో జలకళ హారతికి పూజలు చేశారు రోజా. సుమారు పది సంవత్సరాల తరువాత వరద నీటితో పూర్తిగా చెరువులు, కుంటలు నిండిపోవడంతో మొత్తం నిండుకుండలా మారింది. దీంతో నియోజకవర్గంలో తాగునీటి సమస్య కూడా తలెత్తే అవకాశం లేదని భావిస్తున్నారు అధికారులు.
ఈ నేపథ్యంలో రోజా స్వయంగా జలహారతి ఇచ్చి నవ్వుతూ ఉత్సాహంగా కనిపించారు. నీటి సమస్య ఇప్పట్లో ప్రజలకు రాదని.. వరుణ దేవుడి కటాక్షంతో వర్షాలు బాగా పడ్డాయని.. ఇక స్టోరేజ్ వాటర్‌ను శుభ్రం చేసి ప్రజలకు నీటి అవసరాలను తీరుస్తామని రోజా చెప్పుకొచ్చారు.