గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (09:37 IST)

అట్టహాసంగా ప్రముఖ లిరిసిస్ట్ శ్రీమణి వివాహం.. మా కల నిజమైంది..

ShreeMani
ప్రముఖ లిరిసిస్ట్ శ్రీమణికి వివాహమైంది. సుకుమార్ తెరకెక్కించిన '100% లవ్' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన శ్రీమణి... సెగ సినిమాలోని వర్షం ముందుగా అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఎన్నో అద్భుతమైన సినిమాలకు పని చేశారు. ప్రేక్షకుల నాడిని పట్టి ఎన్నో మంచి లిరిక్స్ ఇచ్చిన శ్రీమణి ఎక్కువగా త్రివిక్రమ్ సినిమాలకు లేదంటే దేవి శ్రీ సంగీత సారధ్యంలో రూపొందిన సినిమాలకు పని చేశారు. రీసెంట్‌గా 'ఉప్పెన', 'రంగ్‌దే' సినిమాలకు శ్రీమణి సాహిత్యం అందించారు.
 
పదేళ్లుగా తను ప్రేమించిన అమ్మాయి ఫరాతో పెళ్లి పీటలెక్కిన శ్రీమణి అందుకు సంబంధించిన ఫొటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఫరాను తన జీవితంలో స్వాగతం చెప్తున్నానని చెప్పారు. గత పదేళ్ళుగా ఈ క్షణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాం. మా కల నిజమైంది. మా మనసులని అర్థం చేసుకున్న దేవుడికి , తల్లిదండ్రులకి ధన్యవాదాలు అని శ్రీమణి పేర్కొన్నారు
 
శ్రీమణికి దేవి శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కంగ్రాట్స్ శ్రీమణి.. ''మీ రొమాంటిక్ లిరిక్స్ వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. 'ఇష్క్ సిఫాయా' అని పాడి.. 'రంగులద్దుకున్న' అని సీక్రెట్‌గా లవ్ చేసి.. 'ఏమిటో ఇది' అని మేమందరం అనుకునేలా పెళ్లిచేసుకున్నారన్న మాట'' అని రాసుకొచ్చారు దేవి.