గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (09:20 IST)

పెన్మత్స సురేష్‌బాబుకు ఎమ్మెల్సీ

దివంగత సీనియర్‌ నాయకులు, విజయనగరం జిల్లాకు చెందిన  పెన్మత్స సాంబశివరాజు తనయుడు డా. పెన్మత్స సూర్యనారాయణరాజు( డా. సురేష్‌బాబు)ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని సీఎం, వైయస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌ నిర్ణయించారు.

రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి సురేష్‌ బాబు పేరును జగన్‌ నిర్ణయించారు.

ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే. జిల్లాలో ఆ కుటుంబం పట్ల ప్రజల్లో వున్న అభిమానం, గతంలో చేసిన వాగ్దానం మేరకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.