బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (21:48 IST)

ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలకు టీడీపీ విప్ జారీ

తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికై వైసీపీకి మద్దతు తెలిపిన ముగ్గురు ఎమ్మెల్సీలకు టీడీపీ విప్ జారీ చేసింది. టీడీపీ తరపున శాసనమండలిలో పార్టీ విప్ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జారీ చేశారు.

ఎమ్మెల్సీలు సీహెచ్ శివనాధరెడ్డి, పోతుల సునీత, పి.శమంతకమణికి విప్ జారీ చేస్తూ నోటీసులు పంపించారు. బుధవారం మండలిలో జరిగే ఓటింగ్ కు హాజరై పార్టీ తరపున ఓటు వేయాలని టీడీపీ విప్ జారీ చేశారు.

శాసనమండలిలో సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై ఓటింగ్ జరిగినా సిద్ధమవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా టీడీపి ఎమ్మెల్సీ లకు విప్ జారీ చేసింది.