మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (19:07 IST)

మహిళలను కించపరిచే విధంగా సినిమాలు: బిజెపి మహిళా మోర్చా

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే విధంగా ఉండాల్సిన సినిమాలు దెబ్బతీసే విధంగా మహిళలను కించపరిచే విధంగా సినిమాలు తీయడం దురదృష్టకరమైన విషయం అని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీత మూర్తి అన్నారు.

అశ్లీలమైన అసభ్యకరమైన సినిమాలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది . పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కుటుంబ సభ్యులు అందరూ కలిసి సినిమా చూసే పరిస్థితి లేకుండా ఉన్నది  ఎంతో భవిష్యత్తు ఉన్న యువతను, చిన్న పిల్లలను మంచి దిశవైపు సన్మార్గం వైపు నడిపించాల్సిన అవసరం ఉంది.

వారిని చెడు మార్గం వైపు మళ్లించకుండా సినిమాలు దోహదపడాలి కానీ వారిని నేర ప్రవృత్తి వైపు, మహిళలపై అత్యాచారాలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. వాటిని వెంటనే నిషేధించాలని భారతీయ జనతా మహిళా మోర్చా డిమాండ్ చేస్తున్నది.