వెర్రి వెధవలారా! ఆ ప్రముఖ నటీమణి.. నీలిచిత్ర నటి: రఘురామ కృష్ణరాజు
సినీ నటి శ్రీరెడ్డిపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేరెత్తకుండానే శ్రీరెడ్డి తిట్ల దండకానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వెర్రి వెధవలారా! ఆ ప్రముఖ నటీమణి.. నీలిచిత్ర నటి'' అంటూ రెడ్లలో కలుపు మొక్కలు ఉంటారని వ్యాఖ్యానించారు.
మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ.. విగ్గురాజును మాట్లాడుతున్నానంటూ.. తనపై చేసిన కామెంట్‌ను ప్రస్తావిస్తూ విమర్శల వర్షం కురిపించారు. ''ఒక ప్రముఖ నటి.. శృంగార తార.. ఆమె దీక్షలు చేసినా.. గుడ్డలు విప్పి దీక్షలు చేస్తారు. దీక్షల్లో అదో వెరైటీ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి కూడా ఆ వీరనారి నీచంగా మాట్లాడారు.
కరోనా వచ్చినప్పడు కూడా మహానటి అతినీచంగా స్పందించారు. బిజ్జల ఇచ్చిన పిలుపు మేరకు నిన్న నా మీద ఓ వీడియో రిలీజ్ చేసి పెట్టారు. నన్ను తిట్టడానికి వైసీపీలో రెడ్లు తప్ప ఇంకెవరూ లేరా... మిగిలినవారితో తిట్టించరా సజ్జలా.. మీరొక్కరే తిడితే బాలేదురా... వెయ్యి మందిలో 999 మంది రెడ్లే ఉంటున్నారు.
పార్టీ మంచి కోసం చెబుతున్నాను. మీరు పిచ్చిగా అభిమానించే అతనికే మంచిది కాదు. నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇలాగే చెలరేగి వాగితే నా వెంట్రుక కూడా పీకలేరు. మీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నానని ఫైర్ అయ్యారు.