సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (18:18 IST)

విజయసాయిరెడ్డికే పలకని 104 కాల్, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో?

కొవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు ప్రతి జిల్లాలో 104 కాల్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొవిడ్ ఆస్పత్రులు, కేర్ సెంటర్లు, పడకలు, అంబులెన్స్‌ల వివరాల కోసం ఈ కాల్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో కాల్​సెంటర్ల పనితీరు ఆశించినంత మెరుగ్గా ఉండటంలేదు. 
 
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ కేజీహెచ్​ ఆసుపత్రిని పరిశీలించారు. ఆ సమయంలో కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన 104 కాల్​ సెంటర్​కు ఫోన్ చేయగా.. కనెక్ట్ కాలేదు. దాదాపు 20 నిమిషాలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది
 
విజయవాడ కేంద్రంగా 104 కాల్​సెంటర్లను పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. సర్వర్​లో తలెత్తిన తాత్కలిక సాంకేతిక లోపం వల్ల కాల్స్ ఆలస్యమవుతున్నాయని అధికారి వివరణ ఇచ్చారు. సమస్యను వెంటనే సరిదిద్దాలని విజయసాయి అధికారులను ఆదేశించారు.